Business: బిజినెస్ మీ కల అయితే.. ఆ కలను సాకారం చేసే స్కీమ్ ఇది.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

ఉద్యోగం లేదని బాధపడుతున్నారా? ఏదైనా చిన్న వ్యాపారం చేద్దామన్నా ఆర్థిక పరిస్థితి సహకరించక మిన్నకుండిపోతున్నారా? జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఆందోళన చెందుతున్నారా? అయితే మీకో శుభవార్త. పెద్ద ఉపశమనం. మొదట మీరు గట్టిగా శ్వాస తీసుకొని ప్రశాంతంగా ఈ కథనం చదవండి. ఎందుకంటే మీ కలలు సాకారమయ్యే మంచి అవకాశం గురించి మీకు వివరించబోతున్నాం.

Business: బిజినెస్ మీ కల అయితే.. ఆ కలను సాకారం చేసే స్కీమ్ ఇది.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..
Money

Updated on: Feb 05, 2024 | 6:21 AM

ఉద్యోగం లేదని బాధపడుతున్నారా? ఏదైనా చిన్న వ్యాపారం చేద్దామన్నా ఆర్థిక పరిస్థితి సహకరించక మిన్నకుండిపోతున్నారా? జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఆందోళన చెందుతున్నారా? అయితే మీకో శుభవార్త. పెద్ద ఉపశమనం. మొదట మీరు గట్టిగా శ్వాస తీసుకొని ప్రశాంతంగా ఈ కథనం చదవండి. ఎందుకంటే మీ కలలు సాకారమయ్యే మంచి అవకాశం గురించి మీకు వివరించబోతున్నాం. ఏదైనా బిజినెస్ చేయాలని తాపత్రయ పడే యువత కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని మీకు అందిస్తోంది. దీని ద్వారా మీరు ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ. 10లక్షల వరకూ లోన్ పొందొచ్చు. వాటిని బిజినెస్ ప్రారంభ పెట్టుబడిగా మలుచుకొని ముందడుగు వేయొచ్చు. ఆ పథకం పేరు ప్రధానమంత్రి ముద్రా యోజన(పీఎంఎంవై). యువతలో స్వావలంబన, సాధికారతను తీసుకొచ్చేందుకు, వారిలో వ్యవస్థాపకతను పెంపొందించడానికి ఉద్దేశించిన పథకం ఇది. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏం ఏం పత్రాలు కావాలి? లోన్ తిరిగి చెల్లించే వెసులుబాటు ఎలా ఉంటుంది. తెలుసుకుందాం రండి..

ముద్రా లోన్ ప్రధాన ఉద్దేశం ఇదే..

ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) 2015లో ప్రారంభమైంది. సొంతంగా వ్యాపారం చేయాలని కలలుగనే యువతకు ప్రోత్సాహాన్నిచ్చి.. వారి కలను సాకారం చేసి, వారిని శక్తికలిగిన పారిశ్రామిక వేత్తులుగా చేయడమే ఈ పథక ముఖ్య ఉద్దేశం. అంతేకాక ఇప్పటికే ఏదైనా చిన్న వ్యాపారం చేస్తూ దానిని మరింత విస్తరించాలనుకునే వారికి కూడా ఈ ముద్రా లోన్ ఉపకరిస్తుంది. ఇది ఇతర రుణ పథకాల మాదిరిగా కాకుండా కార్పొరేట్, వ్యవసాయేతర ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది.

కొలేటరల్-ఫ్రీ ఫైనాన్షియల్ సపోర్ట్..

ముద్రా లోన్ ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది కొలేటరల్-ఫ్రీ లోన్‌లను అందిస్తుంది. రుణగ్రహీతలు తమ ఆస్తిని సెక్యూరిటీగా తనఖా పెట్టే సంప్రదాయ రుణాల మాదిరిగా కాకుండా సులభంగా లోన్లు మంజూరు అవుతాయి. ఆస్తులు లేని వ్యక్తులు ఆర్థిక సహాయం పొందేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తాయి.

లోన్ కేటగిరీలు..

ముద్రా లోన్లు మూడు కేటగిరీలలో రుణాలను వస్తాయి. ప్రతి ఒక్కటి విభిన్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఉంటుంది:

శిశు రుణం : రూ. 50,000 వరకు ఆర్థిక సహాయం.

కిషోర్ లోన్ : రూ. 5 లక్షల వరకు రుణాలు

తరుణ్ లోన్ : అధిక రుణ పరిమితి, రూ. 10 లక్షల వరకు..

దరఖాస్తుదారులకు అర్హత ప్రమాణాలు

  • పీఎంఎవైకి అర్హత పొందాలంటే, దరఖాస్తుదారులు తప్పనిసరిగా నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
  • దరఖాస్తుదారు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి.
  • దరఖాస్తుదారు బ్యాంకు డిఫాల్ట్ చేసిన చరిత్ర ఉండకూడదు.
  • ముద్రా రుణం కోరే వ్యాపారం కార్పొరేట్ సంస్థ కాకూడదు.
  • దరఖాస్తుదారు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి.
  • దరఖాస్తుదారుడి వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి.

పీఎంఎంవై లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?

పీఎంఎంవై లోన్ కోసం దరఖాస్తు చేయడం అనేది సరళమైన ప్రక్రియ..

  • mudra.org.inలో అధికారిక ముద్రా యోజన వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • మీ అవసరాల ఆధారంగా రుణ వర్గాన్ని (శిశు, కిషోర్ లేదా తరుణ్) ఎంచుకోండి.
  • వెబ్‌సైట్ నుంచిదరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను కచ్చితంగా పూరించి, చిరునామా రుజువు, ఆదాయపు పన్ను రిటర్న్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో పాటు ప్రాజెక్టు రిపోర్టును జత చేయండి.
  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను మీ సమీపంలోని బ్యాంకుకు సమర్పించండి.
  • బ్యాంక్ మీ దరఖాస్తును ధ్రువీకరించి. ఒక నెలలోపు రుణం మంజూరు చేస్తుంది.

ఆన్ లైన్‌లో కూడా..

ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ఇష్టపడే వారికి, ముద్రా లోన్ వెబ్‌సైట్‌లో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను సృష్టించడం సులభం. లాగిన్ అయ్యాక ఆన్ లైన్ అప్లికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేసేయడమే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..