
Gold Price Today: కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం, వెండి ధరలు మళ్లీ దూసుకుపోతున్నాయి. ఎంత తగ్గినా తులం బంగారం కొనాలంటేనే లక్షా 20 రూపాయలకుపైగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. తులం బంగారం ధర రెండు రోజుల్లో సుమారు రూ.3000 పెరిగితే కిలో వెండి ధర రూ.5000 పెరిగింది. బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండటం పసిడిప్రేమికులకు ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ 27న ఉదయం 6 గంటల సమయానికి దేశీయంగా తులం బంగారం ధర రూ.1,27,920 ఉండగా, కిలో వెండి ధర రూ. లక్షా 69,100 ఉంది.
బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అమెరికా మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలే కారణమని చెప్పవచ్చు. ప్రధానంగా డిసెంబర్ నెలలో ఫెడరల్ రిజర్వ్ భేటీ జరగనుంది. ఇందులో కీలకమైన వడ్డీ రేట్ల పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో ప్రధానంగా వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Auto News: ఈ 5 బైక్‌లు యాక్టివా ధర కంటే తక్కువే.. మైలేజీ లీటరుకు 73 కి.మీ!
అందుకు తగ్గట్టుగానే ఫెడరల్ రిజర్వు అధికారులు సంకేతాలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డాలర్ విలువ బలహీనపడటం గమనించవచ్చు. ఫలితంగా బంగారం ధర పెరగడం ప్రారంభించింది. సాధారణంగా డాలర్ విలువ తగ్గినట్లయితే బంగారం ధర పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: Maruti Car: మారుతి ఆల్టో కంటే చౌకైగా.. కేవలం రూ.3.5 లక్షలకే సరికొత్త 5 సీట్ల కారు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి