Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందో తెలుసా..

బంగారం కొనాలనుకునే వారికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో గోల్డ్ కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి.. నానాటికి పెరుగుతూ.. సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి..

Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందో తెలుసా..
Gold Price

Updated on: Oct 13, 2025 | 10:26 AM

బంగారం కొనాలనుకునే వారికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో గోల్డ్ కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి.. నానాటికి పెరుగుతూ.. సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి.. బంగారంతో పాటు.. సిల్వర్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తాజాగా.. బంగారం తులం ధర లక్షా 25వేల మార్క్ దాటింది.. వెండి కిలో ధర ఏకంగా లక్షా 85 వేల మార్క్ దాటింది. సోమవారం, బంగారం, వెండి ధరలు అదే జోరుతో ట్రేడవుతున్నాయి.. తాజాగా.. బంగారం 10 గ్రాములపై రూ.320 మేర ధర పెరగగా.. వెండిపై ఏకంగా రూ.5వేల ధర పెరిగింది.

సోమవారం ఉదయం దేశీయంగా నమోదైన ధరల ప్రకారం..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.320 మేర ధర పెరిగి.. రూ.1,25,400 కి చేరుకుంది.

22 క్యారెట్ల గోల్డ్ పై రూ.300 మేర ధర పెరిగి.. రూ.1,14,950 కి చేరుకుంది.

18 క్యారెట్ల బంగారం పది గ్రాములపై రూ.240 మేర ధర పెరిగి.. రూ.94,050కి చేరుకుంది.

కాగా.. వెండి కిలో ధర రూ.5వేల మేర పెరిగి.. రూ.1,85,000 లకు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 25 వేల 400 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,14,950 లుగా ఉంది. కిలో వెండి ధర లక్షా 95 వేల రూపాయలుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర.. రూ.1,25,400 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.రూ.1,14,950 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,85,000 లుగా ఉంది.

కాగా.. బంగారం ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ధరలు మారుతుంటాయి..

పసిడి పరుగులకు అంతర్జాతీయంగా పలు పరిణామాలు ఊతమిస్తున్నాయని.. ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..