అక్షయ తృతీయ వేళ బంగారు ఆభరణాలు కొనాలనుకునే వారికి బిగ్ షాక్. రికార్డ్ స్థాయిలో పసిడి ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. బంగారం మాత్రమే కాదు.. వెండి ధరలు కూడా ఒక్కసారిగా జంప్ అయ్యాయి. ఆల్ టైమ్ హైకి చేరాయి. అంతర్జాతీయంగా గోల్డ్ ఔన్స్‌కు 2,041డాలర్లు పలుకుతుండగా, వెండి ఔన్స్ 25.88 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లు ముగిసే సమయానికి బంగారం ధరలు దేశీయ మార్కెట్‌లో రూ. 61,780 పలుకుతోంది. దేశంలో బంగారం, వెండి ధరలు ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.480 పెరిగింది. దాంతో బంగారం ధర రూ.61,780కి చేరింది. వెండి ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. ఇవాళ కిలో రూ.410 పెరిగి రూ.77,580 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం(24 క్యారెట్లు) రూ. 600 పెరిగి రూ. 61,200 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 550పెరిగి 56, 650 వద్ద ఉంది. వెండి ఏకంగా కిలోకి రూ. 1200 పెరిగి రూ.83,800 పలుకుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..