Gold Prices: బంగారం ధరలపై భారీ గుడ్‌‌న్యూస్.. తగ్గిన ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరలపై శుభవార్త అందింది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తోన్న ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఇది కొనుగోలుదారులకు ఊరటగా చెప్పవచ్చు. ఆదివారం స్థిరంగా ఉన్న ధరలు.. సోమవారానికి తగ్గుముఖం పట్టాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎన్నా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Gold Prices: బంగారం ధరలపై భారీ గుడ్‌‌న్యూస్.. తగ్గిన ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
Gold Price Today

Updated on: Dec 22, 2025 | 6:45 AM

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వస్తోన్న గోల్డ్ రేట్లు సోమవారం స్వల్ప తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల్లో బంగారం ధరలు పెరగడంతో అలాగే కొనసాగుతాయని అందరూ ఊహించారు. కానీ ఈ వారంలో తొలిరోజే గోల్డ్ రేట్లు దిగొచ్చాయి. స్వల్పంగా బంగారం ధర తగ్గడంతో అందరూ ఊరట చెందుతున్నారు. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,170గా ఉంది. నిన్న ఇదే ధర రూ.1,34,180 వద్ద కొనసాగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఇవాళ రూ.1,22,990 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇదే ధర రూ.1,23,000గా ఉంది.

-ఇక విజయవాడలో సోమవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,170 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇదే ధర రూ.1,34,180గా ఉంది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,22,990గా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

-చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,35,270 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,990గా ఉంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రూ.1,34,170గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,22,990గా ఉంది.

వెండి ధరలు ఇలా

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,25,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2,26,000గా ఉంది.

-విజయవాడలో కేజీ వెండి రూ.2,25,900గా ఉండగా.. విశాఖపట్నంలో కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి