Gold Price: బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త.. ధరల్లో ఊహించని మార్పులు.. ఈ రోజు తులం ఎంతంటే..?

గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఆదివారం కాస్త శాంతించాయి. ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు షాక్‌కు గురి అయ్యారు. ఇప్పుడు కాస్త శాంతిస్తుండటంతో ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Price: బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త.. ధరల్లో ఊహించని మార్పులు.. ఈ రోజు తులం ఎంతంటే..?

Updated on: Dec 21, 2025 | 7:07 AM

బంగారం ధరల్లో గత కొద్దిరోజులుగా భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒకరోజు భారీగా తగ్గితే.. మరుసటి రోజు కాస్త శాంతిస్తున్నాయి. గోల్డ్ రేట్లలో జరుగుతున్న ఈ ఊహించని మార్పులతో ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతోండగా.. ఇప్పుడు కాస్త బ్రేక్ పడింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారంకు డిమాండ్ పెరిగింది. ధరలు తగ్గడంతో ఇప్పుడు కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. ఆదివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

-అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 7.95 డాలర్లు పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 4340 వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.85 డాలర్ల మేర పెరిగింది.

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,180 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,23,000 వద్ద ఉంది.

-విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,34,180గా ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి

-ఇక చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,280 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,24,000 వద్ద ఉంది.

-ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,34,180 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది

వెండి ధరలు ఇలా..

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,26,000 వద్ద కొనసాగుతుండగా.. విజయవాడలో కూడా అదే ధర పలుకుతోంది. ఇక విశాఖపట్నంలో కూడా కేజీ వెండి ధర రూ.2,26,000గా ఉంది. ఇక చెన్నై, బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.