Gold Rate Today: ఫ్యూచర్స్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర తగ్గింది. అయితే, బంగారం ధరలు తగ్గగా, వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. బలహీనమైన అంతర్జాతీయ ధోరణి మధ్య దేశ రాజధాని బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం పడిపోయింది. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.50 తగ్గి రూ.54,450కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,400లకు చేరుకుంది. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఈ సమాచారాన్ని అందించింది. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.59,450 వద్ద ముగిసింది. అయితే, MCXలో బంగారం లాభాలతో ట్రేడవుతోంది.
వెండి ధరలో మాత్రం ఎటువంటి మార్పులేదు. మంగళవారం కిలో వెండి ధర రూ.80,000 వద్ద ట్రేడవుతోంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.54,600గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్లకు వినియోగదారులు రూ.59,550 చెల్లించాలి.
దేశంలోని ఇతర నగరాల గురించి చెప్పాలంటే తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రిటైల్ ధర రూ. 54,750లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,750లుగా నిలిచింది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,450గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం రిటైల్ ధర 10 గ్రాములకు రూ.59,400లుగా ఉంది.
భాగ్యనగరంలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.54,450లు చెల్లించాల్సి వస్తుండగా.. 24 క్యారెట్ల బంగారానికి రూ.59,400లు చెల్లించాలి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంతోపాటు ఇతర ప్రాంతాల్లో 24 క్యారెట్ల ధర రూ.59,450లు ఉండగా, 22 క్యారెట్లు రూ.54,500లకు చేరింది.
మార్కెట్లో బంగారం డిమాండ్, సరఫరాపై ఆధారపడి ఉంటుంది. బంగారం డిమాండ్ పెరిగితే రేటు కూడా పెరుగుతుంది. బంగారం సరఫరా పెరిగితే ధర తగ్గుతుంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా బంగారం ధర ప్రభావితమవుతుంది. ఉదాహరణకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పేలవమైన పనితీరును కలిగి ఉంటే, పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. దీంతో బంగారం ధర పెరుగుతుంది.
గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ లో ఉదయం 6 గంటల వరకు నమోదైనవని గుర్తించాలి. అయితే ఈ ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కొనేముందు ప్రస్తుత ధరలను ఓసారి చెక్ చేసుకోవడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..