Gold Rate Today: బంగారం, వెండి ధరలకు బ్రేక్‌.. తాజాగా తులం గోల్డ్‌ ఎంత ఉందో తెలుసా?

|

Aug 11, 2024 | 6:19 AM

భారత్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. బడ్జెట్‌ సందర్భంగా భారీగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. అయితే నిన్న దాదాపు 300 రూపాయల వరకు పెరిగిన బంగారం ధరలు.. తాజాగా ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు...

Gold Rate Today: బంగారం, వెండి ధరలకు బ్రేక్‌.. తాజాగా తులం గోల్డ్‌ ఎంత ఉందో తెలుసా?
Gold Price
Follow us on

భారత్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. బడ్జెట్‌ సందర్భంగా భారీగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. అయితే నిన్న దాదాపు 300 రూపాయల వరకు పెరిగిన బంగారం ధరలు.. తాజాగా ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యలలో బంగారం షాపులన్నివినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. ఆగస్టు 11 దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,310 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 ఉండగా, 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,310 ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,310 ఉంది.
  3. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,460 ఉంది.
  4. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,310 ఉంది.
  5. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,310 ఉంది.
  6. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,310 ఉంది.
  7. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,310 ఉంది.
  8. పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,310 వద్ద కొనసాగుతోంది.
  9. ఇక బంగారం బాటలోనే వెండి కూడా కొనసాగుతోంది. ఆదివారం వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ.83,100 వద్ద ఉంది. అయితే కొన్ని నగరాల్లో హైదరాబాద్‌, కేరళ, చెన్నై నగరాల్లో వెండి ధర కిలోకు రూ.88,100 కొనసాగుతుండగా, ఇతర నగరాల్లో రూ.83,100 ఉంది.

మేకింగ్ ఛార్జీలు, ట్యాక్స్‌లు విడివిడిగా..

ఇండియన్ బులియన్ జువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ధరలు వివిధ స్వచ్ఛతలతో కూడిన బంగారం ప్రామాణిక ధర గురించి సమాచారాన్ని అందజేస్తాయి. ఈ ధరలన్నీ పన్ను, మేకింగ్ ఛార్జీలకు ముందు ఉంటాయి. IBJA జారీ చేసిన రేట్లు దేశవ్యాప్తంగా సార్వత్రికమైనవి కానీ వాటి ధరలలో జీఎస్టీ ఉండదు. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, బంగారం లేదా వెండి ధరలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాటిలో పన్నులు ఉంటాయి.