
పసిడి ప్రియులకు బంగారం, వెండి ధరలు వరుస షాక్‌లు ఇస్తున్నాయి.గత రెండ్రోజులుగా ఈ ఆభరణాల ధరలు బ్రేకుల్లేని బండిలా పరుగులు పెడుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం కూడా బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్, రూపాయి విలువ మారకం ప్రభావంతోనే బంగారం, వెండి ధరల్లో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,460గా ఉండగా నిన్న ఈ ధర రూ..1,43,290 వద్ద స్థిరపడింది. అంటే తులం బంగారంపై రూ.170 పెరిగింది. ఇక 22 క్యాటర్ల బంగారం ధర చూసుకుంటే.. రూ.1,31,500 వద్ద ట్రేడవుతుంది. నిన్నటితో పోల్చుకుంటే దీని ధర రూ.150 పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే.. రూ. 2,34,900గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
కొనే ముందు ఇది గమనించండి
అయితే అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ మారకం వల్ల ఎప్పకప్పుడూ బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రాంతాలను బట్టి కూడా ఈ ఆభరణాల ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఎందుకంటే స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల కారణంగా వీటి ధరలు మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు బంగారం కొనే ప్లాన్‌లో ఉంటే.. ముందు లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ లేదా..ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.