Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. గత కొంతకాలం నుంచి మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం ధరలు 60వేల మార్క్ దాటి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి ధరలు స్వల్పంగా తగ్గుతూ లేదా స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. సాధారణంగా పెళ్లిళ్లు, ఇళ్లల్లో శుభకార్యాలైనా, పండుగలు ఉన్నా.. చాలామంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే బంగారం, వెండి ధరలపై అందరూ ఓ కన్నేసి ఉంచుతూ తగ్గినప్పుడు విక్రయిస్తుంటారు. తాజాగా, బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు తగ్గాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,100 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.59,020 గా ఉంది. కిలో వెండి ధర రూ.200 మేర తగ్గి రూ.73,300 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,300 లు గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.73,300 లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,500, కేరళలో రూ.76,500, బెంగళూరులో రూ.72,500, కోల్కతాలో రూ.73,500 లుగా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.76,500 గా ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.76,500 లుగా కొనసాగుతోంది.
బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.