బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ భారీగా పెరుగుతున్న రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో..

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల కాస్త తగ్గి ఊరటనిచ్చిన పసిడి ధరలు.. మరోసారి పైకి కదులుతున్నాయి. బుధవారం (ఆగస్టు 19) ఉదయం నమోదైన రేట్ల ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,900గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,42,910గా ఉంది. వెండి ధర కిలోకు రూ.2,49,900గా కొనసాగుతోంది. నగరాలు, మార్కెట్లను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చు.

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ భారీగా పెరుగుతున్న రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold And Silver Latest Prices

Updated on: Aug 19, 2026 | 6:42 AM

పసిడి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి.. ఇటీవల తగ్గినట్లే తగ్గి.. కాస్త ఊరటనిచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పరుగులు పెడుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో గోల్డ్ ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఘర్షణలు మొదలుకావడంతో పసిడి ధరలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. కాగా.. వారంలోనే బంగారం ధర రూ.3,500 లకు పైగా పెరిగింది. కాగా.. మంగళవారం బంగారం తులంపై రూ.230 మేర ధర పెరిగింది. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా బుధవారం (ఆగస్టు 19) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,55,900 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,42,910 గా ఉంది.

వెండి కిలో ధర రూ.2,49,900 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,55,900, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,910 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,55,900, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,42,910 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,56,050, 22 క్యారెట్ల ధర రూ.1,43,060 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,55,900, 22 క్యారెట్ల ధర రూ.1,42,910 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,55,900, 22 క్యారెట్ల ధర రూ.1,42,910 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,900, 22 క్యారెట్ల ధర రూ.1,42,910 ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us