బంగారం ధర తగ్గిందని సంతోషించేలోపే మళ్లీ షాకిచ్చింది. వరుసగా రెండు రోజులు భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర ఆదివారం ఒక్కసారిగా పెరిగింది. శుక్ర, శనివారాల్లో కలిపి తులం బంగారంపై రూ. 380 వరకు తగ్గగా, ఆదివారం ఒకేసారి రూ. 110 వరకు పెరగడం గమనార్హం. దేశంలో దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది.
ఆదివారం బంగారం ధరలు పెరిగిన తర్వాత 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 54,950వద్ద కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 59,950కి చేరింది. ఇక దేశంలోని కొన్ని ప్రదేశాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 60వేలకిపైగా కొనసాగుతోంది. ఇక రానున్న రోజుల్లోనూ బంగారం ధరలో పెరుగుదల కనిపించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఆదివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…
* చెన్నైలో 22 క్యారెట్స్ తులం గోల్డ్ ధర రూ. 55,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,230గా ఉంది.
* ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,950కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,950గా ఉంది.
* ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,100గా ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్స్ ధర రూ. 54,950కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 59,950 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 54,950కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 59,950గా ఉంది.
* కేరళలో 22 క్యారెట్స్ ధర రూ. 54,950, 24 క్యారెట్స్ ధర రూ. 59,950గా ఉంది.
* పుణెలో 22 క్యారెట్స్ ధర రూ. 54,950కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 59,950గా ఉంది.
* హైదరాబాద్‌లో ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,950 వద్ద కొనసాగుతోంది.
* వరంగల్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 54,950, 24 క్యారెట్స్ ధర రూ. 59,950గా ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 54,950కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,950గా ఉంది.
* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 54,950కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 59,950గా ఉంది.
ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే సాగాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఆదివారం వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై ఒకేరోజు ఏకంగా రూ. 300 పెరగడం గమనార్హం. మరి దేశంలో ఈ రోజు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. చెన్నలో కిలో వెండి ధర రూ. 79,300గా ఉంది. ఇక ఢిల్లీలో, కోల్‌కతాలో, ముంబయి పట్టణాల్లో కిలో వెండి రూ. 75,800వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 79,300 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..