Gold Price Today: పరుగులు పెడుతోన్న బంగారం.. ఈరోజు తులం గోల్డ్‌ ఎంత ఉందంటే..

|

Sep 18, 2023 | 6:16 AM

తాజాగా సోమవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. అటు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంతో పాటు, 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 10 చొప్పున పెరుగుదల కనిపించింది. దీంతో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 54,910కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,900కి చేరింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో సోమవారం...

Gold Price Today: పరుగులు పెడుతోన్న బంగారం.. ఈరోజు తులం గోల్డ్‌ ఎంత ఉందంటే..
Gold Price
Follow us on

బంగారం ధరలు పరగులు పెడుతున్నాయి. తగ్గేదాని కంటే పెరగడమే ఎక్కువగా ఉంటోంది. ఈ మధ్య కాలంలో ట్రెండ్ గమనిస్తే దేశంలో గోల్డ్ రేట్స్‌లో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా సోమవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. అటు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంతో పాటు, 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 10 చొప్పున పెరుగుదల కనిపించింది. దీంతో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 54,910కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,900కి చేరింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,060 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,330 గా ఉంది. ఇక ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,910 వద్ద కొనసాగుతండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 59,900 గా ఉంది. ఇక కోల్‌కతాలో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,910 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 59,900 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,910 , 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 59,900 వద్ద కొనసాగుతోంది. ఇక దక్షిణాదిలో మరో ప్రధాన నగరం చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,310కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ. 60,330 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 54,910 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,900 గా ఉంది. ఇక నిజామాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,910 , 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 59,900గా ఉంది. వరంగల్‌లో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 54,910 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 59,900 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,910, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 59,900 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నంలోనూ 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ రూ. 54,910, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ ధర రూ. 59,900 గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఓవైపు బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో సోమవారం వెండి ధర స్థిరంగా కొనసాగింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ 74,700, ముంబయిలో కిలో వెండి ధర రూ. 74,700, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,700గా ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,250 గా ఉండగా, చెన్నైలో సోమవారం కిలో వెండి ధర రూ. 78,200 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 78,200 కాగా, విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 78,200 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..