Gold and Silver Latest Prices: మార్కెట్లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. పండుగలున్నా, వివాహాలు, శుభకార్యాలున్నా చాలామంది పసిడి, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే, వీటి ధరలపై అంతా ఆసక్తి చూపుతుంటారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధరలు పెరిగితే, మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. తాజాగా, బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గురువారం ఉదయం వరకు బులియన్ మార్కెట్లో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 లు ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.59,450 ఉంది. అయితే, 22 క్యారెట్లపై రూ.340, 24 క్యారెట్లపై రూ.380 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.1000 మేర తగ్గి రూ.73,500 లుగా కొనసాగుతోంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.55,650 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,600 లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.54,800, 24 క్యారెట్ల ధర రూ.59,780గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450, కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 లుగా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 లుగా ఉంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,450 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 లుగా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,500 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.73,500, చెన్నైలో రూ.77,000, బెంగళూరులో వెండి కిలో ధర రూ.73,000 గా ఉంది. కేరళలో రూ.77,000, కోల్కతాలో రూ.73,500 ఉంది. హైదరాబాద్లో వెండి ధర రూ.77,000, విజయవాడలో 77,000, విశాఖపట్నంలో రూ.77,000 లుగా కొనసాగుతోంది.
గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..