Gold Rate: ఆ సంవత్సరంలో తులం బంగారం ధర కేవలం వంద రూపాయలే..

Gold Rate: ప్రస్తుతం బంగారం పరుగులుకు కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంపే. ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు వేస్తామని ప్రమాణస్వీకారానికి ముందే ట్రంప్ హెచ్చరించడమే గోల్డ్‌ రేట్‌ పెరగడానికి కారణం. ఆ భయంతో స్టాక్‌మార్కెట్లలోనూ అలజడి మొదలైంది. షేర్‌ మార్కెట్లలో వచ్చే నష్టాలను పూడ్చుకోడానికి బంగారాన్ని..

Gold Rate: ఆ సంవత్సరంలో తులం బంగారం ధర కేవలం వంద రూపాయలే..
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు 200 రూపాయలు పెరిగి 10 గ్రాములకు 99,400 రూపాయలకు చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర బుధవారం చారిత్రాత్మకమైన రూ.1 లక్ష స్థాయి నుండి యు-టర్న్ తీసుకుని 10 గ్రాములకు రూ.2,400 తగ్గి రూ.99,200కి చేరుకుంది. అదే సమయంలో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.98,900కి చేరుకుంది. మునుపటి ముగింపు ధర 10 గ్రాములకు రూ.98,700గా ఉంది. ఇదిలా ఉండగా, గురువారం వెండి ధరలు కిలోకు రూ.700 పెరిగి రూ.99,900కి చేరుకున్నాయి. మునుపటి ముగింపు ధరలో వెండి కిలోకు రూ.99,200 వద్ద ముగిసింది.

Updated on: Apr 21, 2025 | 5:55 PM

పది గ్రాముల బంగారం అక్షరాలా లక్ష రూపాయలను తాకిన సందర్భంలో.. బంగారం ధర మైలు రాళ్లను కూడా ఓసారి చెప్పుకోవాలి. 1959లో మొదటిసారి వంద రూపాయల మార్క్‌ను తాకింది కనకం. ఆ తరువాత.. 1979లో మొదటిసారి వెయ్యి రూపాయల మార్క్‌ను టచ్ చేసింది. ఇక 2007లో ఫస్ట్‌టైమ్.. 10వేల రూపాయల గరిష్ట స్థాయిని చూసింది. 2011 ఆగస్టులో బంగారం ధర మొదటిసారిగా 25వేల మార్కును టచ్‌ చేసింది. 2020 జూలైలో అదే 10 గ్రాముల బంగారం ధర 50వేలు దాటింది. ఈ ఏడాది జనవరిలో 10 గ్రాముల పసిడి ధర 78వేల రూపాయలు. ఇవాళ 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి లక్ష రూపాయలను టాచ్‌ చేసింది. అంటే.. మూడంటే మూడే నెలల్లో లక్ష రూపాయలను తాకింది.

ఇది కూడా చదవండి: Gold ATM: అద్భుతం.. ఈ ఏటీఎంలో బంగారం పెడితే డబ్బులు.. గోల్డ్ నాణ్యత కూడా చెప్పేస్తుంది !

అయితే 1959 నాటి బంగారు బిల్లు వైరల్‌ అవుతోంది. అప్పట్లో ఓ వ్యక్తి తులం బంగారం ధర కేవలం రూ.113కే కోనుగోలు చేసినట్లు ఈ బిల్లు ద్వారా తెలుస్తోంది. అంటే ఒక గ్రాము బంగారం ధర దాదాపు రూ.10 మాత్రమే. ఇది మహారాష్ట్రకు చెందిన ఒక స్వర్ణకారుడికి చెందినదని చెబుతారు. నే

ఇవి కూడా చదవండి


ప్రస్తుతం బంగారం పరుగులుకు కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంపే. ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు వేస్తామని ప్రమాణస్వీకారానికి ముందే ట్రంప్ హెచ్చరించడమే గోల్డ్‌ రేట్‌ పెరగడానికి కారణం. ఆ భయంతో స్టాక్‌మార్కెట్లలోనూ అలజడి మొదలైంది. షేర్‌ మార్కెట్లలో వచ్చే నష్టాలను పూడ్చుకోడానికి బంగారాన్ని హెడ్జింగ్‌గా ఉపయోగిస్తారు. హెడ్జింగ్‌ అంటే అర్థం.. ‘ఏమో షేర్లలో నష్టం వస్తుందేమో.. సో, కచ్చితంగా లాభం వచ్చే దాంట్లో పెడదాం’ అని ఇన్వెస్ట్‌ చేస్తారు చూశారా దాన్ని హెడ్జింగ్‌ అంటారు. ఇక్కడ కచ్చితంగా లాభం వచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ గోల్డే. సో, హెడ్జింగ్‌ కోసం బంగారాన్ని నమ్ముకోవడం కూడా రేటు పెరగడానికి కారణం.

దేశంలో పెళ్లిళ్లు, పండగల సీజన్ వచ్చినప్పుడు కూడా డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది. కాని, భయం వల్ల పెరిగిన దాంతో పోల్చితే పెళ్లిళ్లు-పేరంటాలప్పుడు పెరిగే ధర జస్ట్‌ జుజుబి. ఎందుకంటే.. బంగారం ధరలు మన దగ్గర ముహూర్తాలున్నాయనో, పండగలు వస్తున్నాయనో పెద్దగా పెరగవు. అంతర్జాతీయ అంశాల కారణంగానే పెరగడం, తగ్గడం ఉంటుంది. ఉదాహరణకు డాలర్‌ బలహీనపడుతుంది అనే వార్త చాలు. ప్రపంచం వణికిపోయి బంగారం కొనేస్తుంది. ప్రస్తుతం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లకు భయాలు పోలేదు కాబట్టే బంగారం ధర ఈ స్పీడ్‌లో పరుగులు పెడుతోంది.

ఇది కూడా చదవండి: Gold Price: వామ్మో.. పుత్తడి రికార్డ్‌ బ్రేక్‌.. లక్ష రూపాయలకు చేరిన బంగారం ధర

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి