ఆగష్టు 15 రోజు ఏకంగా రూ.2,500 తగ్గి బంగారు ప్రియులకు షాక్ ఇచ్చించింది బంగారం. దీంతో.. జోరుగా ఆ రోజు బంగారం కొనుగోళ్లు సాగాయి. ఆ తర్వాతి రోజు మళ్లీ పెరిగి.. వినియోగదారులను బిత్తరపోయేలా చేశాయి. ఈ నేపథ్యంలో.. మళ్లీ ఎప్పుడు తగ్గుతుందా..? మరలా ఎప్పుడు కొందామా అని.. బంగారం ప్రియులు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరలా ఈ రోజు రూ.250ల తగ్గింపుతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.39,100లుగా ప్రస్తుతం మార్కెట్లో పలుకుతోంది. కాగా.. 22 క్యారెట్స్ ఆభరణాలు 10 గ్రాముల ధర రూ.36,000లు ఉంది. అలాగే.. వెండి కిలో రూ.47,800లు ఉంది. మార్కెట్ విశ్లేషకులు సైతం బంగారం ధరల పెరుగుదల అంచనాపై కాస్త తడబాటును వ్యక్తం చేస్తున్నారు. కానీ.. రానున్న రోజుల్లో మాత్రం బంగారం ధరలు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయని వారు చెబుతున్నారు.