
బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత మూడు వారాలుగా తగ్గుతుండగా.. ఇప్పుడు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు నిరాశ చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడం, వినాయక చవితి, దసరా పండుగలు వస్తున్న క్రమంలో గోల్డ్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ధరలు పెరగడం షాక్‌గా చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో ముడి చమురు ధరలు మళ్లీ రికార్డ్ దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం బ్యారెల్‌కు 100 డాలర్లను క్రాస్ చేసింది. దీంతో ద్రవ్యోల్బణంపై భయాలు పెరుగుతుండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 11వ తేదీన శుక్రవారం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,520 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,560 వద్ద ట్రేడవుతోంది.
-హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,520 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,560 పలుకుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,55,520గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,560 వద్ద కొనసాగుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,520 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,560 వద్ద ట్రేడవుతోంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,55,670 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,710 వద్ద ట్రేడవుతోంది.
-ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,55,100 వద్ద ట్రేడవుతోండగా.. నిన్న రూ.2,55,000 వద్ద స్థిరపడింది
-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.2,54,900 వద్ద ట్రేడవుతోండగా.. గురువారం రూ.2.55 లక్షల వద్ద స్థిరపడింది.
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,54,900 వద్ద ట్రేడవుతోండగా.. గురువారం రూ.2.55 లక్షల వద్ద కొనసాగింది.
-బెంగళూరులో కిలో సిల్వర్ ధర రూ.2,55,100 వద్ద ప్రస్తుతం కొనసాగుతోండగా.. నిన్న రూ.2.55 లక్షల వద్ద ముగిసింది.