Good News.. పసిడి పరుగులకు బ్రేక్.. రికార్డు స్థాయిలో తగ్గిన బంగారం ధర

| Edited By:

Feb 26, 2020 | 2:00 AM

గత కొద్ది రోజులుగా బ్రేకులు ఫెయిల్ అయిన బండిలా పరుగులెత్తిన బంగారం ధరలకు.. మంగళవారం సడన్ బ్రేకులు పడ్డాయి. ఏకంగా ఒక్కరోజే.. పది గ్రాములకు రూ.1200/- తగ్గింది. గత ఐదురోజుల్లో పదిగ్రాముల బంగారం క్రమక్రమంగా పెరుగుతూ.. ఏకంగా రూ. 3000 పెరిగి రూ.45వేలకు పైగా చేరుకుంది. అయితే అదే స్థాయిలో ఒక్కసారిగా మంగళవారం ధర పడిపోయింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1200 తగ్గి (పది గ్రాములకు) రూ.42,855కి చేరుకుంది. ఐదు రోజుల తర్వాత.. మంగళవారం రోజు బంగారం […]

Good News.. పసిడి పరుగులకు బ్రేక్.. రికార్డు స్థాయిలో తగ్గిన బంగారం ధర
Follow us on

గత కొద్ది రోజులుగా బ్రేకులు ఫెయిల్ అయిన బండిలా పరుగులెత్తిన బంగారం ధరలకు.. మంగళవారం సడన్ బ్రేకులు పడ్డాయి. ఏకంగా ఒక్కరోజే.. పది గ్రాములకు రూ.1200/- తగ్గింది. గత ఐదురోజుల్లో పదిగ్రాముల బంగారం క్రమక్రమంగా పెరుగుతూ.. ఏకంగా రూ. 3000 పెరిగి రూ.45వేలకు పైగా చేరుకుంది. అయితే అదే స్థాయిలో ఒక్కసారిగా మంగళవారం ధర పడిపోయింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1200 తగ్గి (పది గ్రాములకు) రూ.42,855కి చేరుకుంది.

ఐదు రోజుల తర్వాత.. మంగళవారం రోజు బంగారం ధర తగ్గంది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి కూడా రూ. 1495 తగ్గి రూ. 47,910కి చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం ఓ రీజన్ అయితే.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధరలు పడిపోవడం మరో రీజన్‌ అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.