Gold Price Today: గుడ్‌న్యూస్‌.. దేశీయంగా భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..!

Gold Price Today: ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు ధరలు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజు పెరుగుతోంది. ఇక తాజాగా పసిడి ధర భారీగానే..

Gold Price Today: గుడ్‌న్యూస్‌.. దేశీయంగా భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..!
Gold

Edited By:

Updated on: Aug 09, 2021 | 6:18 PM

Gold Price Today: ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు ధరలు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజు పెరుగుతోంది. ఇక తాజాగా పసిడి ధర భారీగానే దిగి వచ్చింది. చాలా మంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటు బంగారంపై పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా పసిడి ధర దిగివస్తోంది. పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా విలువ ఇస్తుంటారు మహిళలు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఆదివారం బంగారం ధరలు భారీగా దిగిరావడం కొంత ఊరట కలిగించే అంశమనే చెప్పాలి. దేశీయంగా పరిశీస్తే.. 10 గ్రాముల ధరపై రూ.1000 వరకు తగ్గుముఖం పట్టింది. కొన్ని కొన్ని నగరాల్లో 600 నుంచి రూ.1000 వరకు తగ్గింది. అయితే ఈ ధరలు ఉదయం ఆరున్నర గంటలకు నమోదైనవి మాత్రమే. బంగార కొనుగోలు చేసే వారు వెళ్లే సమయానికి ధర ఎంత ఉందో తెలుకుని వెళ్లడం మంచిది. ఎందుకంటే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇక ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

► దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది.

అయితే బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో ఖాతా తెరవాలంటే హామీదారు సంతకం అవసరమా..? కస్టమర్‌ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన బ్యాంకు

Customers Alert: ఈ బ్యాంకులో కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు.. సెప్టెంబర్‌ 30 వరకు వీటిపై ఎలాంటి ఛార్జీలు ఉండవు

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us