Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

|

May 30, 2022 | 6:40 AM

ఇక కొన్ని రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు సోమవారం ఉదయం స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలలో ఎలాంటి మార్పు జరగలేదు.

Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold And Silver
Follow us on

గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోల్లు మాత్రం తగ్గడంలేదు.. ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ సామాన్యులు సైతం పసిడి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కొన్ని రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు సోమవారం ఉదయం స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలలో ఎలాంటి మార్పు జరగలేదు. సోమవారం ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,090 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,750గా ఉంది.

అలాగే దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలలో ఎలాంటి మార్పులు జరగలేదు. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,750 ఉంది.. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,090గా ఉంది. కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 47,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,090గా ఉంది.. ఇక హైదరాబాద్ మార్కెట్లోలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,090 పలుకుతోంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,090గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,750 కొనసాగుతుండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,090గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,150గా ఉంది.

ఇదిలా ఉంటే.. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. సోమవారం ఉదయం దేశీయ మార్కెట్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ.67000 ఉండగా, ముంబైలో రూ.62,200 ఉంది, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,200 ఉండగా, కోల్‌కతాలో రూ.62,200 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో సిల్వర్‌ ధర రూ.67,000 ఉండగా, హైదరాబాద్‌లో రూ.67000 ఉంది. ఇక కేరళలో రూ.67000 ఉండగా, విజయవాడలో రూ.67000 వద్ద ఉంది.