Gold and Silver Latest Prices: బులియన్ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతాయి. అయితే, తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశీయంగా బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,000 లు ఉండగా.. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.60,000 లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.160 మేర ధర తగ్గింది. కాగా, కిలో వెండి ధర రూ.500 మేర తగ్గి రూ.77,000 లుగా కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ల ధర 60,150 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,000, 24 క్యారెట్లు రూ.రూ.60,000, చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,350, 24 క్యారెట్లు రూ.60,380 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000 లుగా ఉంది.
వెండి ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,000లుగా ఉంది. ముంబైలో రూ.77000, చెన్నైలో రూ.80,000, బెంగళూరులో రూ.76000, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో రూ.80,000 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. కాగా.. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..