Telugu News Business Gold Price Today: July 11th 2023 Gold and Silver Rate in Hyderabad Vijayawada Chennai Delhi Mumbai
Gold Price Today: పసిడి కొనేవారికి శుభవార్త.. తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
బంగారం కొనేవారికి శుభవార్త. ధరలు మళ్లీ తగ్గాయి. ఆదివారం భారీగా పెరిగి సోమవారం స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు మంగళవారం (జులై 11) మాత్రం తగ్గాయి. తులంపై సుమారు రూ. 100లు తగ్గింది.
బంగారం కొనేవారికి శుభవార్త. ధరలు మళ్లీ తగ్గాయి. ఆదివారం భారీగా పెరిగి సోమవారం స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు మంగళవారం (జులై 11) మాత్రం తగ్గాయి. తులంపై సుమారు రూ. 100లు తగ్గింది. మంగళవారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,410 వద్ద కొనసాగుతోంది. అయితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండిపై రూ. 100 పెరిగింది. మరి మంగళవారం దేశంలో పలు ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలిలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,450గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,410కు లభిస్తోంది.
విజయవాడలో రూ.54,450 (22 క్యారెట్లు)లకు అందుబాటులో ఉండగా, రూ.59,410 (24 క్యారెట్లు)లకు లభిస్తోంది.