Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో

|

Jan 02, 2022 | 7:43 AM

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. బంగారం, వెండి ధరలు ఒక్కోసారి

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో
Gold Price Today
Follow us on

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. అయితే.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు నిత్యం పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. నూతన సంవత్సరం రోజున షాకిచ్చిన బంగారం ధరలు.. రెండో రోజూ (ఆదివారం) కూడా స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.47,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర49,150 గా ఉంది. తులం బంగారంపై రూ.140 మేర పెరిగింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 వద్ద ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,150 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,730 వద్ద కొనసాగుతోంది.
* పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,590 ఉంది.
* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,590 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,590 వద్ద కొనసాగుతోంది.
* ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,590 ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,590గా కొనసాగుతోంది.

Also Read:

PM Narendra Modi: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ..

Road Accident: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్ఐ సహా ఆయన తండ్రి దుర్మరణం.. పెళ్లైన వారానికే..