Gold-Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. అదే బాటలో పయనిస్తున్న వెండి.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..

|

Sep 23, 2021 | 7:15 AM

Gold and Silver Price Today: భారతీయ ప్రజలు బంగారాన్ని ఒక ఆస్తిగా భావిస్తారు. పసిడిని ఆస్తులు ఇచ్చినట్లు ఒక తరం నుండి మరొక తరానికి అందజేస్తారు. అంతేకాదు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో..

Gold-Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. అదే బాటలో పయనిస్తున్న వెండి.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..
Gold And Silver
Follow us on

Gold and Silver Price Today: భారతీయ ప్రజలు బంగారాన్ని ఒక ఆస్తిగా భావిస్తారు. పసిడిని ఆస్తులు ఇచ్చినట్లు ఒక తరం నుండి మరొక తరానికి అందజేస్తారు. అంతేకాదు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో బంగారం తమను ఆదుకుంటుందని భావిస్తారు. అందుల్లనే బంగారంపై వివిధ రూపాయల్లో పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా వివాహం, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత బంగారం, వెండి ధరలు చుక్కలను తాకాయి. అప్పటినుంచి ధరల్లో స్థిరత్వం ఏర్పడలేదు. ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతూ.. అస్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పసిడి, వెండి లోహాలు పెట్టుబడి రూపంగా కూడా చూడబడుతుంది. స్వల్ప , దీర్ఘకాలం పాటు పెట్టుబడులకు అనువైన లోగా పరిగణిస్తున్నారు. బంగారం రేట్లు ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, వడ్డీ రేట్లు నిలకడలేని, నగల మార్కెట్లు సహా అనేక అంతర్జాతీయ అంశాలపై ప్రభావం ఇవి గ్లోబల్ గోల్డ్ రేట్లు ఆధారపడి ఉంటుంది. ఈరోజు (సెప్టెంబర్ 23న) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర పై పై కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము నిన్నటి ధర 4,350లు ఉండగా రూ. ఈరోజు 35 పెరిగి ఈరోజు గ్రాము బంగారం ధర రూ. 4,385లకు చేరుకుంది. ఇక 10గ్రాముల బంగారం ధర నిన్న రూ. 44,500 ఉండగా రూ. 350 పెరిగి ఈరోజు 43,850లకు చేరుకుంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్న రూ. 4,746లు ఉండగా రూ. 38 మేర పెరిగి ఈరోజు 4,784లకు చేరుకుంది. ఇక 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 47, 460 ఉండగా ఈరోజు రూ. 380 ల మేర పెరిగి సెప్టెంబర్ 23 ఉదయానికి రూ. 47840లకు చేరుకుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడలో కొనసాగుతున్నాయి.

ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,360ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,360గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,110గా ఉంది.

వెండి ధరలు:

వెండిని ఫంక్షన్లకు ప్రధాన లోగా వాడతారు. దీంతో వెండి కూడా రోజు రోజుకీ దేశ వ్యాప్తంగా విభిన్న ధరలను నమోదు చేస్తుంది.  దేశంలో గురువారం సెప్టెంబర్ 23నాటికి  భారత మార్కెట్‌లో కిలో వెండి రూ.60,900గా ఉంది. అయితే హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలోని ప్రధాన నగరాల్లో వెండి ధర భారీగా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.65,100 ఉండగా.. ఇదే ధర విజయవాడలో, విశాఖపట్నంలో కూడా కొనసాగుతుంది.

Also Read:  తెలియక చేసినా.. పాపం ఎన్ని జన్మలైనా వెంటాడుతుంది.. రాజు దానం చేసే సమయంలో దోషం అంటకుండా ఎలా ఉండాలంటే..