Gold Price Today: మళ్లీ అదే జోరు.. పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఏంతంటే..

Gold and Silver Prices: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. శనివారం బంగారం, వెండి ధరల్లో పెరుగదల నమోదైంది. తాజాగా ఏప్రిల్‌ 4వ తేదీన దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగితే వెండి కూడా స్వల్పంగా తగ్గింది..

Gold Price Today: మళ్లీ అదే జోరు.. పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఏంతంటే..
ధరల మార్పు: అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువపై ఆధారపడి ధరలు రోజులో ఎప్పుడైనా మారవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపులో ఒకసారి సరిచూసుకోవడం మంచిది.

Updated on: Apr 04, 2026 | 6:37 AM

Gold Price Today: గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇటీవల భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తిరిగి పుంజుకుంటున్నాయి. గత నెలలో రెండు లోహాల ధరలు భారీగా పతనం అయ్యాయి. మార్చి నెల చివర నుంచి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. శనివారం బంగారం, వెండి ధరల్లో పెరుగదల నమోదైంది. తాజాగా ఏప్రిల్‌ 4వ తేదీన దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగితే వెండి కూడా స్వల్పంగా తగ్గింది. నిన్న ఒక్క రోజే తులం బంగారం ధర 2 వేల రూపాయల వరకు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,940 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,360 ఉంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,940 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,360 ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,090 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,510 ఉంది.
  4. ముంబై 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,940 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,360 ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,100 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,510 ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,940 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,360 ఉంది.

వెండి ధరలు:

ఇక బంగారం ధర స్వల్పంగా పెరిగితే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. వంద రూపాయలు తగ్గింపుతో ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నై, కేరళలో ఇదే ధర కొనసాగుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us