
గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. నిన్న ఒక్కరోజే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శనివారం ఒక్క రోజులోనే 24 క్యారట్ల బంగారం ధరపై రూ.1,360 పెరిగి రూ.1,29,820 చేరుకోగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,250 పెరిగి రూ.1,19,000కి చేరింది. అయితే నవంబర్ 30వ ఆదివారం ఉదయం 6 గంటల వరకు మాత్రం వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.. ఆదివారం కూడా 24 క్యారట్ల బంగారం ధర రూ.1,29,820 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,19,000 వద్ద కొనసాగుతుంది.
భారీగా పెరుగుతున్న రేట్లతో బంగారం కొనేందుకు వెనకడుగు వేసి వెండి వైపు మొగ్గుచూపుతున్నారు జనాలు. అయితే ఇప్పుడు వెండి కూడా వారికి అందని ద్రాక్షలా మారుతుంది. ఇది కూడా బంగారం బాటలోనే సమాన్యులకు చుక్కలు చూపిస్తుంది. శనివారం ఒక్కరోజే కేజీ వెండి ధరపై ఏకంగా రూ.9వేలు పెరిగి రూ.1,92,000 ఆల్‌టైం హైకి చేరుకుంది. ఇక నిన్నటితో పోల్చుకుంటే వెండి ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు.. నవంబర్ 30 ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు కూడా కేజీ వెండి ధర రూ. రూ.1,92,000 వద్దనే కొనసాగుతుంది.
ఈ భారీ మార్పుల చేర్పుల తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆదివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి