
రోజులలో బంగారం ధర లక్ష రూపాయలకు మించి పెరిగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ కిషోర్ నార్నే అంచనా వేశారు. ఇక మార్నింగ్‌స్టార్‌కు చెందిన జాన్ మిల్స్ బంగారం ధరలు గ్రాముకు రూ.40,000 వరకు తగ్గవచ్చని అంచనా వేశారు. ఇది ప్రస్తుత ధర కంటే 38-40% తగ్గుదలను సూచిస్తుంది. అయితే, ప్రస్తుత మార్కెట్లో, అధిక సరఫరా, తక్కువ డిమాండ్ ఉంటే, బంగారం ధర తగ్గవచ్చని ఆర్థికవేత్తలు సూచించారు. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.95,670 వద్ద కొనసాగుతోంది.
ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. తాజాగా ఫిబ్రవరి 12న దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు..లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఆయా ప్రాంతాలను బట్టి బంగారం ధరల్లో తేడా ఉండవచ్చని గుర్తించుకోండి.
బడ్జెట్‌కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత, అమెరికన్ విధానాల కారణంగా, ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోలును పెంచుతున్నారు. దీని కారణంగా దాని ధర నిరంతరం పెరుగుతోంది. వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు ప్రపంచ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగితే బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వివాహాలు, పండుగ సీజన్లలో వారి డిమాండ్ ఎక్కువగా ఉండవచ్చు. దీని కారణంగా ధరలు అధిక స్థాయిలో ఉండవచ్చు.
ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు:
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,026 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 వద్ద ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 ఉంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,026 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,540 ఉంది.
- హైదరాబాద్‌లో22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 వద్ద ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 వద్ద ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 వద్ద ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 వద్ద ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 వద్ద ఉంది.
- ఇక వెండి ధర విషయానికొస్తే కిలో వెండి ధర రూ.99,400 వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: Satellite Internet: ఇది వింటేనే షాకవుతారు.. ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి