దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలో పెరుగదల కనిపించడం లేదు. కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధరలు అమాంతంగా దిగి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. మధ్యమధ్యలో కాస్త పెరుగుదల కనిపించినా.. గత వారం రోజులుగా కంటిన్యూగా తగ్గుతూనే ఉంది. మన దేశంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది.
ఎందుకంటే ధరలు తగ్గడంతో డిమాండ్ మరింతగా ఉంటుందని, అందుకే బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇక తాజాగా సెప్టెంబర్ 5న దేశంలో బంగారం, వెండి మరోసారి తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర రూ.84,900 వద్ద ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి