Gold Price Today: ఇది గమనించారా.. బంగారం ధర మళ్లీ పెరిగింది.! హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?

మొన్నటి వరకు నేల చూపులు చూసిన బంగారం ధరలు.. మళ్లీ వరుసగా మూడు రోజుల నుంచి పెరుగుతూపోతున్నాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలో మార్పు కనిపిస్తోంది. స్వల్పంగా పెరిగిన ఈ ధరలు.. గోల్డ్ లవర్స్‌ను మళ్లీ షాక్‌కు గురి చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులు..

Gold Price Today: ఇది గమనించారా.. బంగారం ధర మళ్లీ పెరిగింది.! హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
Gold Price Today

Updated on: May 29, 2024 | 7:35 AM

మొన్నటి వరకు నేల చూపులు చూసిన బంగారం ధరలు.. మళ్లీ వరుసగా మూడు రోజుల నుంచి పెరుగుతూపోతున్నాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలో మార్పు కనిపిస్తోంది. స్వల్పంగా పెరిగిన ఈ ధరలు.. గోల్డ్ లవర్స్‌ను మళ్లీ షాక్‌కు గురి చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులు, బంగారం, వెండిపై పెట్టుబడులు తగ్గడం లాంటివి.. ఈ ధరల హెచ్చుతగ్గులకు కారణమై ఉండొచ్చునని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,010కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ. 73,090 వద్ద కొనసాగుతోంది. ఇక ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,860గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,940 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,410గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,540 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,860కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,940 వద్ద స్థిరంగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,860గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,940 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,860గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,940గా ఉంది.

ఇక విశాఖపట్నంలోనూ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 66,860, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,940 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు పైపైకి..

వెండి ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. కిలో వెండి ధర రూ. లక్ష దాటేసింది. బుధవారం ఢిల్లీతోపాటు, ముంబయి, కోలకతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 96,600గా ఉంది. ఇక చెన్నైతో పాటు, హైదారబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, కేరళలలో కిలో వెండి ధర రూ. 1,01,100 వద్ద కొనసాగుతోంది.

ఇది చదవండి: రూ. 10 వేల పెట్టుబడితో వ్యాపారం.. ఉన్న ఊర్లోనే రూ. 60 వేల సంపాదన.. అదేంటంటే?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us