Gold Price Today: పరుగులు తీస్తున్న పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

|

May 22, 2024 | 8:18 AM

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు హడలెత్తిస్తున్నాయి. దాదాపు ఏడాదిగా సామాన్యుడికి అందనంత దూరంగా బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. మంగళవారంతో పోల్చితే పుత్తడి ధర గ్రాముకు ఈ రోజు రూ. 1 మాత్రమే తగ్గింది. దీంతో ధరలో పెద్దగా మార్పేమీ చోటు చేసుకోలేదు. ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Price Today: పరుగులు తీస్తున్న పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today
Follow us on

హైదరాబాద్, మే 22: దేశ వ్యాప్తంగా బంగారం ధరలు హడలెత్తిస్తున్నాయి. దాదాపు ఏడాదిగా సామాన్యుడికి అందనంత దూరంగా బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. మంగళవారంతో పోల్చితే పుత్తడి ధర గ్రాముకు ఈ రోజు రూ. 1 మాత్రమే తగ్గింది. దీంతో ధరలో పెద్దగా మార్పేమీ చోటు చేసుకోలేదు. ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

  • 18 క్యారెట్ల గోల్డ్‌ ఒక గ్రాము రూ.5,587.. 8 గ్రాములు రూ. 44,696.. 10 గ్రాములు రూ.55,870 వద్ద కొనసాగుతున్నాయి.
  • 22 క్యారెట్ల గోల్డ్‌ ఒక గ్రాము రూ.6,829.. 8 గ్రాములు రూ. 54,632.. 10 గ్రాములు రూ.68,290 వద్ద కొనసాగుతున్నాయి.
  • ఇక 24 క్యారెట్ల గోల్డ్‌ ఒక గ్రాముకు రూ.7,450.. 8 గ్రాములు రూ.59,600.. 10 గ్రాములు రూ.74,500 వద్ద ధరలు కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.5,587 ఉండగా 10 గ్రాములు రూ.55,870 ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.6,829 ఉండగా 10 గ్రాములు 68,290లుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.7,450 ఉండగా.. 10 గ్రాములు 74,500లుగా ఉంది.

విజయవాడలో 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.5,587.20 ఉండగా 10 గ్రాములు రూ.55,872ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.6,829 ఉండగా 10 గ్రాములు 68,290లుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.7,450 ఉండగా.. 10 గ్రాములు 74,500లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇక వెండి ధరల్లోనూ పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. కేజీ వెండికి రూ.100 తగ్గింది. దీంతో ఈరోజు వెండి కేజీ రూ.94,500 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంటే నిన్నటి మీద వంద రూపాయలు తగ్గాయన్నమాట. చెన్నైలో కేజీ వెండి రూ.98,900, ముంబైలో రూ.94,500, ఢిల్లీలో రూ.94,500, హైదారబాద్‌లో రూ.98,900, విజయవాడలో రూ.98,900, విశాఖపట్నంలో రూ.98,900 ధర పలుకుతోంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధర దూకుడు కూడా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. సుమారు రూ.లక్ష మార్కుకు చేరువలో ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్ చేయండి.