Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Gold and Silver Latest Prices: ఇటీవల స్వల్ప హెచ్చుతగ్గులతో లేదా స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు తాజాగా.. మళ్లీ పెరిగాయి. సాధారణంగా పసిడి, వెండిని.. ఏమైనా శుభకార్యాలున్నా, పండుగలున్నా చాలామంది కొనుగోలు చేస్తుంటారు. అందుకే.. అందరి దృష్టి బంగారం, వెండి ధరలపై ఉంటుంది. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold Price

Updated on: Aug 24, 2023 | 6:31 AM

Gold and Silver Latest Prices: బులియన్ మార్కెట్‌లో గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. ఇటీవల స్వల్ప హెచ్చుతగ్గులతో లేదా స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు తాజాగా.. మళ్లీ పెరిగాయి. సాధారణంగా పసిడి, వెండిని.. ఏమైనా శుభకార్యాలున్నా, పండుగలున్నా చాలామంది కొనుగోలు చేస్తుంటారు. అందుకే.. అందరి దృష్టి బంగారం, వెండి ధరలపై ఉంటుంది. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,300 గా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.59,230 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.100 మేర పెరిగింది. వెండి కిలో ధర రూ.5,00 ల మేర పెరిగి 75,300 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి..

ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,400 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,300, 24 క్యారెట్లు రూ.59,230 గా ఉంది. చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,660, 24 క్యారెట్ల ధర రూ.59,630, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,300, 24 క్యారెట్ల ధర రూ.59,230 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,300, 24 క్యారెట్లు రూ.59,230 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,300, 24 క్యారెట్లు రూ.59,230గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,230 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లు రూ.54,300, 24 క్యారెట్లు రూ.59,230, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,230గా ఉంది.

ఇవి కూడా చదవండి

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,300 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.75,300, చెన్నైలో వెండి కిలో ధర రూ.78,500, కేరళలో రూ.78,500 లుగా ఉంది. బెంగళూరులో వెండి ధర రూ.74,500, కోల్‌కతాలో రూ.75,300 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.78,500 ఉండగా.. విజయవాడలో రూ.78,500, విశాఖపట్నంలో రూ.78,500 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us