Gold Price: పసిడి ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు రోజుకో రికార్డ్ స్థాయికి చేరుతూ ఆల్‌టైమ్‌ హైల్లోనే కదలాడుతున్నాయి. గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. ప్రస్తుతం బంగారం ధర రూ.86 వేల మార్క్ దాటింది.. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Gold Price: పసిడి ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today

Updated on: Feb 09, 2025 | 7:09 AM

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, పరిస్థితుల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి.. అయితే.. గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ప్రస్తుతం బంగారం ధర రూ.86 వేల మార్క్ దాటి పరుగులు పెడుతోంది.. అయితే.. తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం (09 ఫిబ్రవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,450, 24 క్యారెట్ల ధర రూ.86,670 గా ఉంది. వెండి కిలో ధర రూ. 99,500గా ఉంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,450, 24 క్యారెట్ల ధర రూ.86,670 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,450, 24 క్యారెట్ల ధర రూ.86,670 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,600, 24 క్యారెట్ల ధర రూ.86,820 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.79,450, 24 క్యారెట్ల ధర రూ.86,670 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.79,450, 24 క్యారెట్లు రూ.86,670 లుగా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.79,450, 24 క్యారెట్ల ధర రూ.86,670 గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,07,000

విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,07,000 గా ఉంది.

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.99,500 లుగా ఉంది.

ముంబైలో రూ.99,500

బెంగళూరులో రూ.99,500

చెన్నైలో రూ.1,07,000 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..