Gold Price: ఈరోజు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..

|

Dec 03, 2023 | 6:27 AM

బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిచూపిస్తారు. అందున పండుగలు ఏవైనా ప్రత్యేక రోజులు వస్తే చాలు ఎగబడి కొనుగోలు చేస్తారు. అయితే నిన్న మన్నటి వరకూ ఆకాశాన్నంటిన పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం కొనుగోలు దారుల్లో ఆశలు చిగురించేలా చేస్తోంది. అయితే ఈ ఆశ ఎంతో కాలం నిలువలేదు. నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ఈరోజు మళ్లీ పుంజుకుంది.

Gold Price: ఈరోజు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..
Gold Price Today
Follow us on

బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిచూపిస్తారు. అందున పండుగలు ఏవైనా ప్రత్యేక రోజులు వస్తే చాలు ఎగబడి కొనుగోలు చేస్తారు. అయితే నిన్న మన్నటి వరకూ ఆకాశాన్నంటిన పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం కొనుగోలు దారుల్లో ఆశలు చిగురించేలా చేస్తోంది. అయితే ఈ ఆశ ఎంతో కాలం నిలువలేదు. నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ఈరోజు మళ్లీ పుంజుకుంది. ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్‌ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల కారణంగా స్వల్ప ఊరట కలిగింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులపై కాస్త హెచ్చుతగ్గులు కనిపించాయి. దీని ప్రభావం బంగారు ధరలపై పడింది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.62,950 కాగా ఈరోజు ఏకంగా తులంపై రూ.810 పెరిగి రూ. 63,760కి చేరింది . ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,700 ఉండగా ఈరోజు రూ. 750 పెరిగి 58,450 కు చేరింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 82,500 కాగా ఈరోజు కిలోపై రూ. 1000 పెరిగి 83,500 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 63,760
  • విజయవాడ..రూ. 63,760
  • ముంబాయి..రూ. 63,760
  • బెంగళూరు..రూ.63,760
  • చెన్నై..రూ. 64,530

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 58,450
  • విజయవాడ..రూ. 58,450
  • ముంబాయి..రూ. 58,450
  • బెంగళూరు..రూ. 58,450
  • చెన్నై..రూ.59,150

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్..రూ. 83,500
  • విజయవాడ..రూ. 83,500
  • చెన్నై..రూ.83,500
  • ముంబాయి..రూ. 80,500
  • బెంగళూరు..రూ. 79,000

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..