Gold Price Today: ఈ రోజు స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

|

Mar 30, 2021 | 4:21 AM

Gold Rates Today: పసిడి ప్రియులకు ఒక రోజు గుడ్‌ న్యూస్‌ అందుతుంటే.. మరో రోజు బ్యాడ్‌ న్యూస్‌ వినాల్సి వస్తుంది. రోజురోజుకు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఒక రోజు తగ్గుతుంటే..

Gold Price Today: ఈ రోజు స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Price Today
Follow us on

Gold Rates Today: పసిడి ప్రియులకు ఒక రోజు గుడ్‌ న్యూస్‌ అందుతుంటే.. మరో రోజు బ్యాడ్‌ న్యూస్‌ వినాల్సి వస్తుంది. రోజురోజుకు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఒక రోజు తగ్గుతుంటే.. మరో రోజు పెరుగుతుంది. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ఎప్పుడు ధర తగ్గుతుందా అంటూ ఆసక్తితో ఎదుచూస్తుంటారు. తాజాగా మంగళవారం 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. కాగా కొన్ని నగరాల్లో ధరలు తగ్గితే.. మరికొన్ని చోట్ల స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ధరలను ఓసారి చూద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో  10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈ రోజు 44,070 ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 48,070గా కొనసాగుతోంది.

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర పది రూపాయలు తగ్గి రూ. 42,980 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,900 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర దాదాపు 200 మేర తగ్గి.. రూ. 41,700 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 45,490 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.42,240 గా ఉండగా. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,080 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర సుమారు 200లు తగ్గి రూ.41,700 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.45,490 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.41,700 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 45,490 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 41,700 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 45,490 వద్ద కొనసాగుతోంది.

కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు 55 వేల వరకు మార్క్‌ దాటి పోయిన బంగారం ధరలు ప్రస్తుతం 42 వేలకు అటు ఇటుగా ఉన్నాయి.

Also Read:

Venomous Snake: పడక గదిలో శబ్ధం.. తలుపు తీస్తే.. రెండు మీటర్ల పొడువైన కోబ్రా.. వాళ్లు ఏం చేశారంటే?

Heat Wave: దేశ రాజధాని ఢిల్లీలో నిప్పులు కక్కిన భానుడు.. 76 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు