Gold Price Today: బంగారం, వెండి కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?

|

Jan 25, 2024 | 10:01 AM

. సోమవారం కాస్త పెరిగిన బంగారం ధరలు మంగళవారం, బుధవారం మాత్రం స్థిరంగా కొనసాగాయి. గురువారం (జనవరి 25) కూడా పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గురువారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.

Gold Price Today: బంగారం, వెండి కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?
Gold
Follow us on

బంగారం, వెండి కొనాలనుకునేవారికి శుభవార్త. గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు వరుసగా మూడో రోజు స్థిరంగా  కొనసాగుతున్నాయి. సోమవారం కాస్త పెరిగిన బంగారం ధరలు మంగళవారం, బుధవారం మాత్రం స్థిరంగా కొనసాగాయి. గురువారం (జనవరి 25) కూడా పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గురువారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. బులియన్‌ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ, 63,000గా కొనసాగుతోంది. అలాగే 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర రూ.57,750 గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధరలకు బంగారం లభిస్తోంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి రూ.75,300 పలుకుతోంది. మరి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం , వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలిలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,000 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750, 24 క్యారెట్ల ధర రూ.63,000 లకు లభిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇతర ప్రధాన నగరాల్లో పసిడి ధరలిలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,150 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,750, 24 క్యారెట్ల ధర రూ.63,650, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,750, 24 క్యారెట్ల ధర రూ.63,000, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,350, 24 క్యారెట్ల ధర రూ.63,650, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,750, 24 క్యారెట్ల ధర రూ.63,000, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,750, 24 క్యారెట్ల ధర రూ.63,000 గా ట్రేడ్‌ అవుతోంది.

వెండి ధరలిలా.

  • హైదరాబాద్..రూ. 76,800
  • విజయవాడ..రూ. 76,800
  • చెన్నై..రూ. 76,800
  • బెంగళూరు..రూ. 72,750
  • ముంబాయి..రూ. 75,300

 

కాగా అమెరికాలో బ్యాంకు వడ్డీ రేటు పెరగవచ్చన్న భయం బంగారం ధరలు తగ్గడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం బంగారం ధర తగ్గుతోంది, అయితే రాబోయే రోజుల్లో ఇది మళ్లీ పెరుగుతుంది. ఈ ఏడాది (2024 చివరి నాటికి) బంగారం ధర రూ.70,000 మార్కును దాటవచ్చని చెబుతున్నారు.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..