Gold Price Today
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మొన్నటి వరకూ స్వల్పంగా పెరిగిన పసిడి రేటు నేడు ఒకే ధర వద్ద స్ధిరంగా కొనసాగుతోంది. బంగారం కొనే వారికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. కారణం అంతర్జాతీయ పెట్టుబడుల్లో వచ్చిన మార్పులు. ద్రవ్యోల్భణ పరిస్థితులు, వడ్డీ రేట్లు అన్నీ వెరసి పసిడి ధర పరుగులను నియంత్రిస్తున్నట్లు తెలుపుతున్నారు. అయితే నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లో బంగారం, వెండి ధరలు ఎలాగున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఆంధ్రప్రదేశ్ విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 66,280 వద్ద ఉంది. నిన్న కూడా ఇదే ధరలు నమోదయ్యాయి. ఇక 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రేటులో కూడా ఎలాంటి మార్పులేదు. నిన్న ఎలాగైతే 10 గ్రాముల ధర రూ.61,250 ఉందో నేడు కూడా ఇదే ధరలతో కొనసాగుతోంది.
- తెలంగాణ విషయానికొస్తే రాజధాని హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,280గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,250 గా ఉంది.
- తమిళనాడు చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,470 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ. 61,850గా ఉంది. నిన్నటి ధరలతో ఎలాంటి మార్పు లేదు.
- కర్ణాటక బెంగళూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,820 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 61,250 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఏవిధమైన మార్పు కనపడలేదు.
- దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల తులం పసడి రేటు రూ.66,820 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 61,250 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ధర పెరగలేదు, తగ్గలేదు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో కిలో వెండి ధరలు ఇలా..
- ఆంధ్రప్రదేశ్ – రూ. 80,500
- తెలంగాణ – రూ. 80,500
- కర్ణాటక – రూ. 76,000
- తమిళనాడు – రూ. 80,500
- మహారాష్ట్ర – రూ. 77,500
వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. నిన్న ఎలాంటి ధరలు నమోదయ్యాయో ఈరోజు కూడా అలాగే స్థిరంగా కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..