పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. అయితే.. బంగారం, వెండి ధరలు కొద్దిరోజులుగా పెరుగుతూ పోతున్నాయి. ఇటీవల గోల్డ్ ధర 80వేలు మార్క్ దాటేయగా.. సిల్వర్ కూడా అదే బాటలో దూసుకుపోతోంది. ప్రస్తుతం లక్ష మార్క్ దాటేసింది వెండి ధర. ప్రస్తుతం కిలో వెండి ధర.. లక్షా 10వేల రూపాయలకు పైగా పలుకుతోంది.
బంగారం ధరలు కూడా రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయ్. ప్రస్తుతం పది గ్రాముల ఫ్యూర్ గోల్డ్ ధర 80వేల 610 రూపాయలుగా ఉంది.
అలాగే, ఆభరణాల గోల్డ్ ధర 24 క్యారెట్లు పది గ్రాముల ధర రూ.79,640 ఉండగా.. 22 క్యారెట్లు రూ.73,000గా పలుకుతోంది.
బుధవారం (23 అక్టోబర్ 2024) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,990, 24 క్యారెట్ల ధర రూ.79,630 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,990, 24 క్యారెట్ల ధర రూ.79,630 గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,140, 24 క్యారెట్ల ధర రూ.79,780 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.72,990, 24 క్యారెట్ల ధర రూ.79,630 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.72,990, 24 క్యారెట్లు రూ.79,630
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.72,990, 24 క్యారెట్ల ధర రూ.79,630 గా ఉంది.
హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.110,100, విజయవాడ, విశాఖపట్నంలో రూ.110,100లుగా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.102,100, ముంబైలో రూ.102,100, బెంగళూరులో రూ.96,800, చెన్నైలో రూ.110,100 లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..