బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి కారణాలు అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రుణాలపై వచ్చిన మార్పులు, డాలర్ విలువ తగ్గుదలతో ఈ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల విషయానికొస్తే తులంపై రూ.10 తగ్గుదల చూపిస్తోంది. నిన్న 10 గ్రాములు స్వచ్చమైన పసిడి ధర రూ. 66,930 కాగా నేడు రూ. 66,920కు చేరింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర నిన్న రూ.61,350 కాగా ఈరోజు రూ. 61,340 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర నిన్న రూ.79,500 ఉండగా ఈరోజు రూ.100 తగ్గింది. అంటే కిలో వెండి ధర ఈరోజు రూ. 79,400కు చేరింది.
ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 67,640 కాగా నేడు తులంపై రూ. 10 తగ్గి రూ. 67,630కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధరలు నిన్న రూ. 62,000 ఉండగా ఈరోజు రూ. 61,990కు చేరింది. వెండి ధర కిలో ఈరోజు రూ. 79,400 కు చేరింది. అదే నిన్న రూ.79,500ఉండేది. అంటే కిలోపై రూ.100 తగ్గింది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విలువ నిన్న రూ. 66,930 కాగా ఈరోజు తులంపై రూ. 10 తగ్గి రూ. 66,920కు చేరింది. అదే 22 క్యారెట్ల బంగారం విషయానికొస్తే నిన్న రూ. 61,350 కాగా ఈరోజు రూ. 61,340గా ఉంది. ఇక వెండి ధర కిలో నిన్న రూ. 76,100 ఉండగా.. ఈరోజు రూ. 76,200 వద్ద కొనసాగుతోంది. అంటే కిలోపై రూ.100 పెరిగింది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్న రూ.66,930 కాగా నేడు తులంపై రూ. 10 తగ్గి రూ. 66,920కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 61,350 ఉండగా ఈరోజు రూ. 10 తగ్గింది. అంటే రూ. 61,340 వద్ద కొనసాగుతోంది. వెండి విషయానికొస్తే నిన్న కిలో ధర రూ.76,500 కాగా ఈరోజు రూ. 100తగ్గి రూ. 76,400 కు చేరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..