Gold Rates Today : కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పసిడి ధరలకు ఏమాత్రం బ్రేక్ పడటంలేదు. దేశంలో ఇటీవల కాలంలో భారీగా పెరిగిన ధరలు కాస్త.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. గత వారం నుంచి బంగారం ధర పతనమవుతూ వస్తోంది. బులియన్ మార్కెట్ ప్రకారం.. ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోకరోజు పెరుగుతుంటాయి. అయితే.. తాజాగా మంగళవారం బంగారం ధరలు తటస్థంగానే కొనసాగుతున్నాయి. అయితే.. కొన్ని చోట్ల తగ్గితే.. మరికొన్నిచోట్ల ధరలు స్థిరంగానే ఉన్నాయి. మంగళవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర.. రూ. 46,220 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47,220 ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
• దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,100 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,300 గా ఉంది.
• ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,220 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,220 వద్ద కొనసాగుతోంది.
• బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 43,900 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 47,890 వద్ద ఉంది.
• చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,380 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
• హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,900 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,890 వద్ద కొనసాగుతోంది.
• విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 43,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.47,890 వద్ద కొనసాగుతోంది.
• విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 43,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 47,890 వద్ద కొనసాగుతోంది.
Also Read: