బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి ధరలు పెరిగాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఒక్కరోజులోనే పసిడి ధర భారీగా పెరిగిపోయింది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పైపైకి కదిలింది. దేశీయ మార్కేట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,160 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,160కి చేరింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. హైదరాబాద్‌తో సహా మిగతా ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,100 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,200కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్ ఒకే విధంగా కొనసాగుతుంది. అక్కడ కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,100 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,200కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,250 ఉండగా… 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ. 51,500కు చేరింది. అలాగే ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,430కు చేరగా.. 10 గ్రాముల 49,560కు చేరింది. మరోవైపు చెన్నైలో ఈ ఉదయం బంగారం ధరలలో భారీగానే మార్పులు జరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,430 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,560కు చేరింది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,100 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,200కు చేరింది.
కాగా పసిడి ధరలపై ప్రభావం చూపే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, వాణిజ్య యుద్దాలు వంటి అంశాలు బంగారం రేట్ పై ప్రభావం చూపిస్తాయి.
Also Read: Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..