Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

|

Sep 17, 2021 | 5:18 AM

Latest Gold Price: బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న సంగతి అందిరికీ తెలిసిందే. మార్కెట్‌లో పసిడి ధరలు

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Price Today
Follow us on

Latest Gold Price: బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న సంగతి అందిరికీ తెలిసిందే. మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి దిగివస్తున్నాయి. నిన్న పెరిగిన ధరలు.. తాజాగా తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,780గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,780గా ఉంది. తులం బంగారంపై తాజాగా.. రూ.550 మేర ధర తగ్గింది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన రేట్ల వివరాలను ఓ సారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,780గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,000గా ఉంది.

Also Read:

PM Modi Birthday: 20 రోజులపాటు ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు.. ఈ సారి అంత ప్రత్యేకం ఎందుకో తెలుసా..?

Drugs: ముంద్రా పోర్టులో రూ.2వేల కోట్ల హెరాయిన్‌ పట్టివేత.. విజయవాడలోని కంపెనీ పేరుతో..