బులియన్ మార్కెట్ పరుగులు పెడుతోంది.. బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరుగుతున్నాయి. అయితే.. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. బంగారానికి లోకల్‌గా డిమాండ్ తక్కువగానే ఉన్నా, అంతర్జాతీయ కారణాల వల్ల బంగారం ధర పెరుగుతోందంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కొంతమేర తగ్గిన ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. ఆల్ టైం రికార్డుకు చేరిన ధరలు.. కాస్త తగ్గడంతో పసిడి ప్రియులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా.. బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం (జులై 07 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర 73,800 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 67,650 గా ఉంది.. వెండి ధర కిలో రూ.94,800లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,650గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,800గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,800గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,800, 24 క్యారెట్ల ధర రూ.73,950 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.67,650, 24 క్యారెట్లు రూ.73,800, చెన్నైలో 22క్యారెట్లు రూ.68,200, 24 క్యారెట్లు రూ.74,400, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.67,650, 24 క్యారెట్లు రూ.73,800గా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.94,800, ముంబైలో రూ.94,800, బెంగళూరులో రూ.93,250, చెన్నైలో రూ.99,300, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.99,300 లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..