ఇది నిజమేనా.. మనందరికీ రూ.117 లక్షల కోట్లు! అంతా బంగారం చలవే.. ఎంత పెరిగే అంత లాభం!

బంగారం ధరలు గత కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. 2025-26లో పుత్తడి ధరలు భారీగా పెరగడంతో, భారతీయుల కుటుంబాల సంపద ఏకంగా రూ.117 లక్షల కోట్లు వృద్ధి చెందింది. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ నివేదిక ప్రకారం ప్రజల వద్ద ఉన్న సంపద గణనీయంగా పెరిగింది.

ఇది నిజమేనా.. మనందరికీ రూ.117 లక్షల కోట్లు! అంతా బంగారం చలవే.. ఎంత పెరిగే అంత లాభం!
Indian Currency 7

Updated on: Jan 18, 2026 | 8:51 AM

గత కొన్ని నెలలుగా బంగారం ధర ఎలా పెరుగుతుందో అందరికీ తెలిసిందే. పట్టుపగ్గాలు లేకుండా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. కేవలం ఒక్క ఏడాది కాలంలోనే ఏకంగా 60 నుంచి 70 మేర బంగారం ధర పెరిగింది. ఈ పెరుగుదలతో సామాన్యులు ఒక తులం బంగారం కొనాలన్నా బెంబేలెత్తిపోతున్నారు. 2025లో మొదలైన పుత్తడి ప్రభంజనం.. 2026లో కూడా కొనసాగుతోంది. మధ్య మధ్యలో కాస్త హెచ్చుతగ్గులు ఉన్నా కూడా.. ఓవరాల్‌గా చూసుకుంటే బంగారం కొండెక్కి కూర్చుంది. అయితే బంగారం ధర పెరుగుదలతో మన దేశంలోని ప్రజల వద్ద సంపద పెరిగిందంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కానీ మన దేశ ప్రజలకు రూ.117 లక్షల కోట్ల సంపద వచ్చి పడింది. ఈ సంపద గురించి హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ ఇయర్ బుక్ -2026 పేరిట ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. భారతీయుల దగ్గర ఉన్న బంగారం విలువ దాదాపు దేశ జీడీపీతోనే పోటీపడుతుండటం విశేషం. 2025 సంవత్సరంలో బంగారం ధర భారీగా పెరిగిన క్రమంలో భారతీయ కుటుంబాల సంపద కూడా పెరిగింది. ఇప్పటి వరకు దాని విలువు రూ.117 లక్షల కోట్లు. 1.3 ట్రిలియన్ డాలర్లకు సమానం. 2025 కంటే ముందు భారతీయుల దగ్గర ఉన్న బంగారం విలువకు ఇప్పుడు ఉన్న విలువకు రూ.117 లక్షల కోట్ల తేడా ఉంది. 2024లో మీ వద్ద తులం బంగారం ఉంటే అప్పుడు దాని విలువు సుమారు రూ.77 వేలు ఉంది. ఇప్పుడే అదే తులం బంగారం విలువ రూ.1,40,000. అంటే మీ సంపద రూ.63 వేలు పెరిగినట్లే.

అలా దేశం మొత్తం మీద ఉన్న బంగారంపై కలిపి రూ.117 లక్షల కోట్ల సంపద పెరిగిందన్నమాట. భారతీయుల వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ రూ. 3.8 ట్రిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 350 లక్షల కోట్లకుపైగా) ఉందని అంచనా. భారతీయుల దగ్గర సుమారు 34,600 టన్నుల మేర బంగారం నిల్వలు ఉన్నట్లు ఇటీవల మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. స్టాక్ మార్కెట్లు గతేడాది తీవ్ర ఒడుదొడుకులకు లోనైనప్పటికీ.. పసిడి ధరలు ఆకాశాన్నంటడంతో భారతీయుల సంపద అనూహ్యంగా పెరిగిందని రిపోర్ట్ పేర్కొంది. ఇక గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంతగా బంగారం ధరలు 2025లో పెరిగాయని.. ఇదే స్థాయిలో సంపద వృద్ధి చెందిందని తెలిపింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి