Gold Rate: ఇండియాలో కంటే బంగ్లాదేశ్‌లో బంగారం ధర తక్కువా? అక్కడ 10 గ్రాముల గోల్డ్‌ ఎంతంటే..?

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, బంగ్లాదేశ్‌లో భారత్ కంటే తక్కువ ధరకే లభిస్తోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇండియాలో రూ.1,61,950 కాగా, బంగ్లాదేశ్‌లో భారత కరెన్సీలో రూ.1,49,422. దాదాపు రూ.11,000 వ్యత్యాసం ఆశ్చర్యకరం. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

Gold Rate: ఇండియాలో కంటే బంగ్లాదేశ్‌లో బంగారం ధర తక్కువా? అక్కడ 10 గ్రాముల గోల్డ్‌ ఎంతంటే..?
Gold 3

Updated on: Jan 28, 2026 | 6:20 AM

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పలు దేశాల మధ్య స్వల్ప తేడా ఉన్నప్పటికీ గతం కంటే భారీ పెరుగుదల కనిపిస్తోంది. అయితే మన దేశంలో కంటే మన పొరుగు దేశం, పేద దేశమైన బంగ్లాదేశ్‌లో బంగారం ధరలు మనకంటే తక్కువ ఉండటం ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. ఇండియా కరెన్సీ కంటే బంగ్లాదేశ్‌ కరెన్సీ విలువ తక్కువ అయినప్పటికీ మన కంటే తులం బంగారం అక్కడ తక్కువ ధరకే లభిస్తోంది.

జనవరి 27 నాటికి ఇండియాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,950 లుగా ఉంది. అదే 10 గ్రాముల బంగారం ధర బంగ్లాదేశ్‌లో వారి కరెన్సీ ప్రకారం 1,99,463 టాకాలుగా ఉంది. బంగ్లాదేశ్‌ కరెన్సీని టాకా అని అంటారు. మన ఒక్క రూపాయి, బంగ్లాదేశ్‌ 1.33 టాకాలతో సమానం. మన కరెన్సీ విలువతో లెక్కిస్తే.. ఇండియాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం కొనాలంటే రూ.1,61,950 అవుతుంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం బంగ్లాదేశ్‌లో కొనుగోలు చేయాలంటే మన ఇండియన్‌ కరెన్సీలో రూ.1,49,422 లకే వచ్చేస్తోంది. దాదాపు రూ.11 వేల తేడా ఉంది.

ఇండియాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి పెడుతున్న రూ.1,61,950 లతో దాదాపు 11 గ్రాముల బంగారం కొనుగోలు చేయొచ్చు. కాగా మన దేశంలో బంగారాన్ని తులం లెక్కన ఎక్కువ కొలుస్తారు. తులం లేదా తుల అంటే 10 గ్రాముల అని అర్థం. అలాగే బంగ్లాదేశ్‌లో బంగారాన్ని భోరి లెక్కన కొలుస్తారు. ఒక భోరి అంటే 11.664 గ్రాములు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఒక భోరి బంగారం వచ్చేసి 2,32,653.64 టాకాలు. అదే మన కరెన్సీలో అయితే ఒక భోరి బంగారం రూ.1,74,286.65 అవుతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి