గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.10వరకు తగ్గింది. వెండి మాత్రం పరుగులు పెడుతోంది. దేశంలోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం షాపులన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ప్రతి రోజు మార్పులు జరిగే బంగారం ధరల్లో ఈ రోజు స్వల్పంగా తగ్గుదల కన్పించింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.100 వరకు తగ్గి ప్రస్తుతం రూ.46,800 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.110 వరకు తగ్గి ప్రస్తుతం రూ.51,050 ఉంది. ఇక కిలో వెండిపై రూ.400 వరకు పెరిగింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు. బంగారం కొనుగోలు చేసే ముందు మీరు వెళ్లే సమయానికి ఎంత ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది. ఇక తాజాగా నవంబర్ 8వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 వద్ద ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,200 వద్ద ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 వద్ద ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100 వద్ద ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 వద్ద ఉంది.
పుణేలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,830 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,080 వద్ద ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 వద్ద ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 వద్ద ఉంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 వద్ద ఉంది.
వెండి ధర ని ఈ రోజు కూడా పెరిగింది. ఇక నగరాల వారిగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.66,700, ముంబైలో రూ.60,850, ఢిల్లీలో రూ.60,850, కోల్‌కతాలో రూ.60,850, బెంగళూరులో రూ.60,850, కేరళలో రూ.66,700, పుణేలో రూ.60,850, హైదరాబాద్‌లో రూ.66,700, విజయవాడలో రూ.66,700, విశాఖలో కిలో వెండి రూ.66,700 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి