Gold Price: పాకిస్తాన్‌లో బంగారం ధరలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మనదేశంలో పెరుగుతున్న బంగారం ధరలను చూసి చాలామంది షాక్ అవుతున్నారు. అయితే మన పొరుగు దేశం అయిన పాకిస్తాన్ లో బంగారం ధరలు ఇక్కడి కంటే ఎక్కువ ఉన్నాయి. ఆ దేశంలో ఒక్క బంగారం ధరలే కాదు కూరగాయల నుంచి ఐఫోన్ వరకూ అన్నింటి ధరలు ఆకాశన్నంటుతున్నాయి.

Gold Price: పాకిస్తాన్‌లో బంగారం ధరలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Updated on: Oct 22, 2025 | 3:06 PM

భారత్‌ లో లాగానే పాకిస్తాన్ లో కూడా బంగారానికి ఎక్కువ విలువ ఇస్తారు. అక్కడి వాళ్లు కూడా బంగారంపై మక్కువ చూపుతారు. అయితే రీసెంట్ గా పెరిగిన బంగారం ధరల ఎఫెక్ట్  పాకిస్తాన్ పై మరింత ఎక్కువ పడింది.  పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి ప్రభుత్వం తరచుగా బంగారం దిగుమతులపై నిషేధాలు విధిస్తుంది. రీసెంట్ గా కూడా నిషేధం విధించడంతో ఇప్పుడు అక్కడ బంగారం కొరత ఏర్పడింది. దాంతో పాకిస్తాన్ లో  బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. పాకిస్తాన్ లో బంగారం ధరలు ఓసారి పరిశీలిస్తే..

బంగారం ధర

భారత్ లో  ఈ రోజుకి 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,150 ఉంటే  పాకిస్తాన్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 4,33,000 పాకిస్తానీ రూపాయలు ఉంది. కిలో వెండి ధర ఇక్కడ రూ. 1,45,000 ఉంటే పాకిస్తాన్ లో 4 లక్షల పాకీస్తానీ రూపాయలకు పైబడి ఉంది.  ఇండియన్ రూపీతో పోలిస్తే పాకిస్తానీ రూపీ విలువ చాలా తక్కువ. డాలర్ వాల్యూతో పోల్చినా తక్కువే. అందుకే ఆ దేశంలో బంగారం ధరలు మిగిలిన దేశాల కంటే మరింత భారీగా పెరిగాయి. దీనికి తోడు ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా రోజురోజుకీ క్షీణిస్తుంది. దీంతో పాకిస్తానీ రూపాయి వాల్యూ మరింత బలహీన పడతూ బంగారం విలువ మరింత బలపడుతూ పోతోంది.

ఇవి కూడా..

ఇకపోతే పాకిస్తాన్ లో బంగారం ధరలు మాత్రమే కాదు. అన్నిరకాల ఎలక్ట్రానిక్స్, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఐఫోన్ 17 ధర మన దేశంలో రూ. 1,34,900 ఉండగా  పాకిస్తాన్ కరెన్సీ ప్రకారం 3.65 లక్షలు. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర మన దగ్గర రూ. 1,49,900 కాగా పాకిస్తాన్ లో 5.73 లక్షల పాకిస్థానీ రూపాయలు. ఇక నిత్యావసరాల విషయానికొస్తే.. పాకిస్తాన్ లో కిలో టమాటా ధర రూ.700 పలుకుతోంది. భారత రూపాయితో పోలిస్తే పాక్‌ రూపాయి విలువ 0.31 పైసలుగా ఉంది.  ఇతర కరెన్సీలతో పోలిస్తే భారీగా పడిపోతోంది. దీనివల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో బంగారం నుంచి టమాటా వరకూ అన్నింటి రేట్లు ఆకాశన్నంటుతున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి