
పసిడి ప్రియులకు ఈ సోమవారం పండగలాంటి వార్త అందింది. బంగారం కొనాలని చూస్తున్న వారికి ఇది ఒక గొప్ప శుభవార్త. మార్కెట్లు తెరుచున్న వెంటనే బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముపై 71 రూపయాలు, 22క్యారెట్ల బంగారం ఒక గ్రాముపై 65 రూపాయలు, 18 క్యారెట్ల బంగారం ఒక గ్రాము 53 రూపాయల చొప్పున దిగివచ్చింది. దీంతో దేశీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 1,25,130 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాము రూ. 1,14,700 పలుకుతుండగా, 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 93850 లకు చేరింది. గోల్డ్ లవర్స్‌కి ఈ తగ్గిన ధరలు నిజంగానే కాస్త ఊరటనిస్తాయని చెప్పాలి.
ఇదిలా ఉంటే, పసిడి బాటలో వెండి కూడా పయనించింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. వెండి గ్రాము ధర రూపాయి తగ్గి రూ.171లకు చేరింది. దీంతో కేజీ వెండి ధర రూ.1,71,000 ధర పలుకుతోంది.
నవంబర్ 24 సోమవారం హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర తులానికి రూ.710 తగ్గి రూ.1,25,130 పలుకుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.650 తగ్గింది. దీంతో 10గ్రాముల ధర రూ.1,14,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.530 తగ్గి రూ.93,850 పలుకుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..