Gold Price: కొన్ని గంటల్లోనే ఊహించని షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయో తెలుసా?

Gold Price: గత రెండు, మూడు రోజులుగా బంగారం భారీగా తగ్గింది. దీంతో చాలా మంది మళ్లీ బంగారం కొనేందుకు ఇష్టపడుతున్నారని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతుండగా, ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. దీపావళి సమయంలో అధిక ధరల కారణంగా కొనుగోలు చేయలేకపోయిన..

Gold Price: కొన్ని గంటల్లోనే ఊహించని షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయో తెలుసా?

Updated on: Oct 25, 2025 | 6:26 PM

Gold Price: బంగారం, వెండి ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల తులం బంగారం ధర ఏకంగ రూ. 1లక్షా 33 వేల వరకు వెళ్లగా, ఇప్పుడు భారీగా దిగి వచ్చింది. ఇప్పుడు తులం ధర రూ.లక్షా 25 వేల వరకు దిగి వచ్చింది. అయితే తాజాగా శనివారం తులం బంగారం ధరపై భారీగా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై 1250 రూపాయులు తగ్గి ప్రస్తుతం తులం ధర రూ.1,25,620 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల ధరపై రూ.1150 తగ్గి ప్రస్తుతం తులం ధర రూ.1,15,150 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,55,000 వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: Railway New Rules: ఇక వందే భారత్‌లో వారి కోసం ప్రత్యేక ఆహారం.. రైల్వే కీలక నిర్ణయం

గత రెండు, మూడు రోజులుగా బంగారం భారీగా తగ్గింది. దీంతో చాలా మంది మళ్లీ బంగారం కొనేందుకు ఇష్టపడుతున్నారని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతుండగా, ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. దీపావళి సమయంలో అధిక ధరల కారణంగా కొనుగోలు చేయలేకపోయిన కస్టమర్లు ఇప్పుడు మార్కెట్‌కు తిరిగి వస్తున్నారని సరాఫా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఇంద్ర సింగ్ మెహతా అన్నారు. కానీ ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ:

  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,770
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,300

హైదరాబాద్‌:

  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,620
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,150

ముంబై:

  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,620
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,150

భారత మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా సాగుతూ, పెట్టుబడిదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పండుగల కాలం ముగిసినా, బంగారంపై డిమాండ్‌ తగ్గకపోవడం ఈ పెరుగుదలలో మరో ముఖ్య కారణంగా కనిపిస్తోంది. మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్న వివరాల ప్రకారం, అంతర్జాతీయ స్థాయిలో అమెరికా డాలర్‌ బలహీనత, మధ్యప్రాచ్య ప్రాంతంలోని రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు సెంట్రల్‌ బ్యాంకులు నిరంతరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి.

ఇది కూడా చదవండి: Liechtenstein: ఇక్కడ రాత్రి పూట ఇళ్లకు తాళం వేయరు.. పోలీసులు ఉండరు.. దొంగలు ఉండరు!

ఇది కూడా చదవండి: Mukesh Ambani: సంస్కారంలోనూ కుబేరుడే.. కొడుకు ఆకాశ్‌తో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి