Gold Price Declines: బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.? అయితే ఇదే సరైన సమయం అని అంటున్నారు విశ్లేషకులు.! 10 గ్రాముల గోల్డ్ ధర గరిష్టంగా రూ.56,200కు చేరుకున్న తర్వాత కేవలం 6 నెలల్లోనే ఒక్కసారిగా రూ.10,000 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.46,690గా ఉంది. అలాగే భవిష్యత్తులో కూడా పసిడి ధరలలో మరింత తగ్గుదల కనబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా డాలర్‌లో స్థితిస్థాపకత, అమెరికా ఖజానా రాబడి పెరగడం వల్ల తొందర్లోనే 10 గ్రాముల బంగారం రూ. 41,000 చేరుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.
కాలక్రమేణా మంచి రాబడి వస్తుందన్న ఉద్దేశంతో పెట్టుబడిదారులు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం ధరలు తగ్గుతున్న నేపధ్యంలో ప్రతీ కొనుగోలు లాభాలు తెచ్చిపెడుతుందని వారి వ్యూహం. ప్రస్తుతం ఆర్ధిక రంగం మరోసారి పుంజుకుంటున్న నేపధ్యంలో చాలామంది ‘ఈక్విటీలు, రిస్క్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. “సాంకేతికంగా, బంగారం రోజూ బలహీనపడుతూ వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే దీర్ఘకాలిక పెట్టుబడిదారుడు రూ. 45,600-45,800 పరిధిలో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం శుక్రవారంతో పోలిస్తే రూ.10 తగ్గి, 22 క్యారెట్ల గోల్డ్ రూ.45,140 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి.. రూ.49,270వద్ద ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికొస్తే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 10 తగ్గి, రూ.45,120 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే రూ.10 తగ్గి, రూ.46,120 వద్ద ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర నిన్నటితో పోలిస్తే రూ.20 తగ్గి, రూ.42,990 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే రూ.10 తగ్గి, రూ.46,890గా ఉంది. విజయవాడలోనూ బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రూ.42,990 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.450 తగ్గి, రూ.46,900 వద్ద ఉంది.
ఇక సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.43,000గా నమోదైంది. 24 క్యారెట్ల విషయానికొస్తే రూ.10 తగ్గి.. రూ. 46,890 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.43,470 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,390 వద్ద కొనసాగుతోంది.