Gold Limit: చట్ట ప్రకారం మీ దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.. ఈ లిమిట్ దాటితే జప్తు చేస్తారు జాగ్రత్త

|

Mar 31, 2025 | 11:57 AM

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. వ్యక్తుల వద్ద ఉండే బంగారంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. లిమిట్‌కు మించి బంగారం ఉంటే మాత్రం.. దానికి లెక్కలు చూపించాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని 132 సెక్షన్ ఈ విషయాన్ని సూచిస్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు.. మీ వద్ద పరిమితికి మించి గోల్డ్ లభిస్తే.. అవి ఎలా వచ్చాయో లెక్కలు చూపించాలి. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. వారసత్వంగా సంక్రమించిన నగలైతే.. గిఫ్ట్ రూపంలో వచ్చిన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలి. లేదంటే జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

Gold Limit: చట్ట ప్రకారం మీ దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.. ఈ లిమిట్ దాటితే జప్తు చేస్తారు జాగ్రత్త
Gold
Follow us on

మన దేశం ప్రజలు బంగారు ప్రియులు. బంగారు ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా నగదును పొదుపు చేసుకుని మరీ పసిడిని కొనుగోలు చేస్తుంటారు. పండగలు, పెళ్లిళ్లు ఇలా శుభకార్యం ఏదైనా బంగారం కొంటూనే ఉంటారు. బంగారాన్ని ఓ హోదాగా భావించి ఒంటి నిండా బంగారు ఆభరణాలతో ముస్తాబు అవుతారు. ఎక్కడికెళ్లినా సరే బంగారం ఉండాల్సిందే. అయితే బంగారం గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం? అసలు మీరు ఒంటినిండా బంగారం వేసుకుంటున్నారు కదా అది ఎంత వరకు మీ దగ్గర ఉండాలో అన్న విషయం ఎవరికైనా తెలుసా? మోతాదుకి మించి బంగారం మీ వద్ద ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

చట్టం ఏం చెబుతుంది?

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, వ్యక్తుల దగ్గర ఉండే బంగారంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ లిమిట్ మించితే, దాని గురించి లెక్కలు చూపించాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 132 ఈ నియమాన్ని సూచిస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేసినప్పుడు, పరిమితి కంటే ఎక్కువ బంగారం దొరికితే, దాని మూలం గురించి వివరణ ఇవ్వాలి. సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలి. వారసత్వంగా వచ్చిన నగలైతే, గిఫ్ట్‌గా వచ్చినట్లు ఆధారాలు చూపాలి. లేకపోతే, ప్రభుత్వం దానిని జప్తు చేయవచ్చు.

ఎంత బంగారం ఉండవచ్చు?

చట్టం ప్రకారం బంగారం పరిమితులు వ్యక్తులను బట్టి మారుతాయి.

పెళ్లైన మహిళలు: 500 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఆధారాలు చూపనవసరం లేదు. అంతకు మించితే డాక్యుమెంట్లు అవసరం.

పెళ్లి కాని మహిళలు: 250 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు.

పురుషులు: వివాహితులైనా, అవివాహితులైనా 100 గ్రాములు మాత్రమే ఉంచుకోవచ్చు.

పరిమితి మించినప్పుడు డాక్యుమెంట్లతో పాటు ఆదాయ మార్గాల గురించి కూడా వివరణ ఇవ్వాలి. సరైన ఆధారాలు లేకపోతే, బంగారం జప్తు అయ్యే ప్రమాదం ఉంటుంది.

వ్యాపారులకు ఈ నియమాలు వర్తించవు

ఈ పరిమితులు వ్యక్తిగత ఉపయోగం కోసం ఉంచే బంగారానికి మాత్రమే. వ్యాపార ప్రయోజనాల కోసం బంగారం ఉంచే వారికి ఈ నియమాలు లేవు. కానీ, వారు లెక్కలు, డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచాలి.

ఈ నిబంధనలు నగలు, నాణేలు, బార్ల రూపంలో ఉన్న బంగారానికి వర్తిస్తాయి. చట్టాన్ని అనుసరించడం ద్వారా సమస్యలను నివారించవచ్చు.